ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు మూడు రాజధానులకు సంబంధించిన కేసులో ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లాగా, అధికారంలోకి రాగానే మరోలా జగన్ మాట మార్చారని పిటిషన్ లో రైతులు తెలిపారు. ఈ విషయంలో సీఎంతో పాటు మంత్రులు, ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే విషయమై హైకోర్టులో ఇతరులు కూడా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను ఇవాళ( గురువారం) హైకోర్టు విచారించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఏపీ ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్ ను మాత్రమే దాఖలు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రతి పిటిషన్ కు ఒక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి డీటీపీ,బీజేపీలకు కూడా లీగల్ నోటీసులు జారీ చేసింది కోర్టు.
