ఫార్ము లా ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ మధ్యంతర బెయిల్ ను డిసెంబర్ 31 వరకు పొడిగించింది హైకోర్టు. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దని వారం రోజుల కింద ఆదేశాలిచ్చిన కోర్టు... తదుపరి విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే..
ఈ క్రమంలో కేటీఆర్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. తనను రాజకీయ కక్షతోనే ఇరికించారంటూ కేటీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు కేటీఆర్. మరో వైపు కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ కోరింది. వాదనలు విన్న హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది.
ALSO READ | భారత్ గొప్ప నాయకున్ని కోల్పోయింది: ఎమ్మెల్యే వివేక్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఏసీబీ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో A1గా మాజీ మంత్రి కేటీఆర్ పేరును చేర్చారు.ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ని ఏ2గా ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఏసీబీ. వీళ్లకు తర్వలోనే నోటీసులు అందించి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ పేర్కొంది. ఈ వివాదంలో ఏ3గా అప్పటి హెచ్ఎండీఏ చిఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. దీంతో పాటు ఓ ప్రైవేటు కంపెనీపైనా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల్లో ఈ కేసులో కీలకమైన వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.