జనసేన పార్టీ గ్లాసు గుర్తు విషయంలో జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్లాసు గుర్తును పలువురు ఇండిపెండెంట్, రెబల్ అభ్యర్థులకు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టు మెట్లెక్కింది జనసేన. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనసేన దాఖలు చేసిన పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. జనసేన చేసిన రెండు డిమాండ్లలో ఒకదానికి మాత్రమే అంగీకారం తెలిపింది ఈసీ. దీంతో ఆ పార్టీకి పాక్షికంగా ఊరట లభించినట్లయింది.
జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించడంపై ఈసీ వివరణ కోరింది హైకోర్టు. ఇందుకు స్పందించిన ఈసీ జనసేన పోటీలో లేని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు, ఇతర పార్టీల అబ్యర్ధులకు గ్లాసు గుర్తు కేటాయించామని తెలిపింది. జనసేన పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లో, రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో గ్లాసు గుర్తు ఇతర అభ్యర్థులకు కేటాయించలేదని క్లారిటీ ఇచ్చింది. గుర్తు పొందని పార్టీల విషయంలో ఇలాంటి చర్యలు తీసుకుంటామని తెలిపింది ఈసీ. దీంతో కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట గ్లాసు గుర్తు కేటాయింమని మాత్రం ఈసీ చెప్పలేదు. మరి, దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.