నిజామాబాద్‎లో హైటెక్ వ్యభిచారం.. ఐదుగురు యువతులు అరెస్టు

నిజామాబాద్, వెలుగు: ఓ హోటల్‎లో హైటెక్​వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు రైడ్ చేసిన పట్టుకున్న ఘటన నిజామాబాద్ సిటీలో జరిగింది.  గురువారం సీపీ కల్మేశ్వర్ తెలిపిన ప్రకారం.. సిటీలోని కృష్ణా కాంటినెంటల్​ హోటల్ రూమ్ ల్లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో బుధవారం రాత్రి పోలీసులు రైడ్ చేశారు. ఐదుగురు యువతులు, 8 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. 

వారి వద్ద రూ.38,760 నగదు, 13 సెల్​ఫోన్లు, ఫేక్​ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్​లోని ఫిల్మ్​నగర్​కు చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. సినీ జూనియర్ ​ఆర్టిస్టులను తెచ్చి దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానించి విచారించారు. ప్రముఖ స్టార్​ హోటల్​గా గుర్తింపు పొందిన కృష్ణా కాంటినెంటల్​కు రాజకీయ పార్టీల లీడర్లు ఎక్కువ శాతం వస్తుంటారు. అక్కడ హైటెక్​ వ్యభిచార ముఠా పట్టుబడడంతో  సిటీలో చర్చనీయాంశమైంది.