హెటిరో నుంచి కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం ఫవిపిరవిర్‌ ప్యాక్

హెటిరో నుంచి కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం ఫవిపిరవిర్‌ ప్యాక్

హెటిరో ఫార్మాకరోనా ట్రీట్‌మెంట్‌ కోసం ఫవిపిరవిర్‌ 800/200 ఎంజీ పేషెంట్ కంప్లియెంట్ ప్యాక్‌ను విడుదల చేసింది. ఫవిపిరవిర్‌ 800/200 పేషెంట్ ఫ్రెండ్లీ ప్యాక్‌లో 16 టాబ్లెట్లు ఫవిపిరవిర్‌ 800ఎంజీవి, 2 టాబ్లెట్లు ఫవిపిరవిర్ 200 ఎంజీవి ఉంటాయి. వీటి ధర రూ.2,640గా ఉంది. హెటిరో తీసుకొచ్చిన ఫవిపిరవిర్ 800ఎంజీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అనుమతి ఇచ్చింది. ఈ ప్రొడక్ట్ హెటిరో హెల్త్‌ కేర్ లిమిటెడ్‌ మార్కెట్, డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ ప్యాక్‌ను మైల్డ్ నుంచి మోడరేట్‌ సింప్టమ్స్‌ ఉన్న పేషెంట్లకు వాడొచ్చు. అంతకుముందు 14 రోజుల ట్రీట్‌మెంట్ కోర్సులో ఫవిపిరవి ర్ 200ఎంజీ టాబ్లెట్లు122 వేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ప్యాక్‌తో 32 టాబ్లెట్లకు తగ్గించనున్నారు. ఇవి మెరుగైన చికిత్సను అందించనున్నట్లు హెటిరో తెలిపింది.