భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని పునరుద్ధరించేందుకు తమ వంతు సాయంగా కొందరు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. వరదలతో కుదేలైన నగర ప్రజలను ఆదుకునేందుకు దాతలు భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో డ్రగ్స్ భారీ విరాళం ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర సర్కారు చేపడుతున్న సహాయ చర్యల కోసం తమ వంతుగా హెటెరో యాజమాన్యం రూ.10 కోట్ల విరాళం అందించాలని నిర్ణయించింది. వరదల వల్ల ఎక్కువగా నష్టపోయిన పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందించి ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని హెటెరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి రెడ్డి తెలిపారు.
