ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రమంతా నెలకొన్న రాజకీయ వేడి ఒక ఎత్తైతే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ వేడి మరో రేంజ్ లో ఉంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్, ఈసారి ఎలా అయినా గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు.
My heartfelt wishes to @PawanKalyan sir on your election journey.
— Sreeleela14 (@SreeLeela_1) May 10, 2024
I hope you achieve everything you wish and keep all your promises.
I pray to God that you win with a huge majority in Pithapuram ?#TDPJanasenaBJP ❤️?✨
పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ నుండి మాత్రమే కాకుండా టాలీవుడ్ నుండి పెద్ద పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వంటి మెగా హీరోలు పిఠాపురంలో పవన్ తరఫున ప్రచారం నిర్వహించగా చిరంజీవి కూడా పవన్ మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు. మరో పక్క, అల్లు అర్జున్, నాని వంటి హీరోల కూడా మద్దతు తెలిపారు. తాజాగా మరో క్రేజీ హీరోయిన్ శ్రీలీల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. "పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, మీరు కోరుకున్నవి అన్ని సాధిస్తారని, వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. పిఠాపురంలో మీరు భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేసింది ఈ యంగ్ బ్యూటీ.