OG Special Song: సెంటరాఫ్ ఎట్రాక్షన్గా గ్లామర్ బ్యూటీ.. ఓజీ స్పెషల్ సాంగ్లో ఛాన్స్!

టాలీవుడ్లో గ్లామర్ లుక్స్తో ఆకట్టుకునే నటి నేహా శెట్టి (Neha Shetty). 'డీజే టిల్లు'లో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆమె 'బెదురులంక 2012', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డీజే టిల్లు స్క్వేర్' వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇపుడీ ఈ బ్యూటీ పవర్ స్టార్ తో స్టెప్పులేయనుందట. ఆ వివరాల్లోకి వెళితే.. 

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఈ స్పెషల్ సాంగ్ లో పవన్ తో నేహా డ్యాన్స్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఓజీ మేకర్స్ అడిగిన వెంటనే సాంగ్ చేయడానికి నేహా ఒప్పుకుందట. అయితే, ఈ స్పెషల్ సాంగ్ పై మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో వచ్చే అవకాశం ఉంది. 

ALSO READ | Viduthalai Part 2: అసామాన్యుడి కథ విడుదల 2..విజయ్‌సేతుపతి పాత్ర ఎలా ఉండబోతుంది?

ఇదిలా ఉంటే.. ఈ మధ్య హీరోయిన్స్ చాలా సినిమాల్లో తమదైన సొగసుతో డ్యాన్స్ కుమ్మేస్తున్నారు. ఇటీవలే శ్రీలీల కిస్సిక్ అంటూ దుమ్మురేపింది. అంతకుముందు కాజల్, తమన్నా, సమంత ఫేమ్ లో ఉండగానే స్పెషల్ సాంగ్తో అదరగొట్టారు. మరి నేహా యూత్‌ను ఆకట్టుకునేలా  ఎలాంటి స్టెప్పులేయనుందో చూడాలి. 

సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నేహా.. సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాషన్ సెన్స్తో ఫాలోవర్స్ను సంపాదిస్తోంది. తరుచూ తన ఫోటో షూట్స్తో, యూట్యూబ్ షార్ట్ వీడియోస్తో ఫేమస్ అవుతూ వస్తున్న నేహా శెట్టికి సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది. తన గ్లామర్ లుక్తో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిన నేహాకు పలు ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది.