ఢిల్లీలో రూ.126 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ పట్టివేత

ఢిల్లీలో రూ.126 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ పట్టివేత

ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 18 కిలోల హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాలో జోహెన్నస్‌బర్గ్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు అనుమానితుల్ని అధికారులు తనిఖీ చేయగా..వారి దగ్గర హెరాయిన్ దొరికింది.

దక్షిణాఫ్రికా నుంచి జూన్‌ 27న బయలుదేరిన వీళ్లు మొదట దుబాయ్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఇవాళ(సోమవారం) ఉదయం ఢిల్లీలో దిగారు. వారి దగ్గర ఉన్న ట్రాలీ బ్యాంగ్‌ కింది భాగంలో హెరాయిన్‌ను దాచి పెట్టగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఒకరి బ్యాగ్‌లో 10 కిలోలు.. మరొకరి బ్యాగ్‌లో 8 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీని విలువ రూ.126 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.