కొత్తపేటలో శ్రీవైభవం మాల్​

సినీ హీరోయిన్ శ్రీలీల శనివారం కొత్తపేటలో సందడి చేశారు. అష్టలక్ష్మి కమాన్​ పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన ‘శ్రీవైభవం’ షాపింగ్ మాల్ ను రిబ్బన్ ​కట్​ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్​లోని కలర్​ఫుల్​చీరలతో ఫొటోలకు పోజులిచ్చారు. ఆమెను చూసేందుకు వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు. తాను నటించిన రీసెంట్ హిట్​ సాంగ్​‘కిస్సిక్’​కు అభిమానులతో స్టెప్పులేయించారు. అలాగే మాల్​ ప్రారంభోత్సవంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ  చైర్మన్ మల్ రెడ్డి రంగారెడ్డి, మాల్​ ఎండీ చలపతి, ఆప్తాబ్ అహ్మద్ పాల్గొన్నారు.