ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలి హీరో సుమన్ 

మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు: ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని హీరో సుమాన్​ అన్నారు. కింగ్ షోటోకాన్ కరాటే డూ ఇండియా ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో   వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరాల పోస్టర్​ను  గురువారం ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ..   మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల  ఫిట్​నెస్​తోపాటు మానసిక ఆరోగ్యం పెరుగుతుందని తెలిపారు.

 ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ   25 ఏళ్ల నుంచి వేసవి ఉచిత కరాటే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు స్కూల్ ఆవరణ, షాసాబ్ గుట్ట లోని ఆల్ నూర్ స్కూల్లో వచ్చే నెల 2  నుంచి జూన్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో  వ్యక్తిత్వ వికాస నిపుణులు లక్ష్మణ్, కరాటే మాస్టర్లు తాజుద్దీన్, కేశవ్ గౌడ్, సీనియర్ కరాటే విద్యార్థి అర్ష్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.