హైదరాబాద్ సిటీ, వెలుగు: సెలబ్రిటీస్ కూడా డ్రగ్స్ నిర్మూలన కోసం కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచన మేరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన రీతిలో స్పందించారు. న్యూఇయర్ వేడుకల వేళ డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు ఉన్నాక డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అని ప్రశ్నించారు. లైఫ్ లో బోలెడన్నీ ఎంజాయ్ మెంట్స్, కావల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉందని తెలిపారు. ఈ రోజు నుంచి డ్రగ్స్ కి గుడ్ బై చెప్పాలని ప్రభాస్ పిలుపునిచ్చారు.
ఎవరైనా డ్రగ్స్ కు బానిసైతే 87126 71111 నంబర్ కు కాల్ చేసి కౌన్సెలింగ్ రిక్వెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలని ప్రభాస్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.