నేను టీడీపీ పార్టీలో చేరలేదు.. అందుకే కండువా : హీరో నిఖిల్

హీరో నిఖిల్ టీడీపీలో చేరాడంటూ ప్రచారం జరుగుతోంది. పసుపు కండువా కప్పుకొని లోకేష్ తో ఉన్న నిఖిల్ ఫోటో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వార్తలపై హీరో నిఖిల్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ టీడీపీలో చేరలేదని, తన దగ్గరి బంధువైన చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని, అందుకే టీడీపీ కండువా కప్పుకున్నారని క్లారిటీ ఇచ్చింది  నిఖిల్ టీమ్. చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందినందుకు మావయ్య ఎమ్ఎమ్ కొండయ్య యాదవ్​‌కు అభినందనలు, అలాగే ధన్యవాదాలు. మా కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని, మీ అందరి ఆశీస్సులు మామయ్యకు కావాలి' అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్.

 

తన మామయ్యకు మద్దతు తెలుపుతూ నిఖిల్ చేసిన ట్వీట్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీంతో నిఖిల్ అభిమానులు, టీడీపీ శ్రేణులు నిఖిల్.. లోకేష్ తో ఉన్న ఫోటోను తెగ షేర్ చేశారు. అయితే.. నిఖిల్ పీఆర్ టీమ్ నుండి క్లారిటీ రావటంతో ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతం నిఖిల్ భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో స్వయంభు సినిమాలో నటిస్తుండగా చందు మొండేటి డైరెక్షన్లో కార్తికేయ 3 సినిమాను అనౌన్స్ చేశారు.