నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది : అల్లు అర్జున్

పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా తను రోడ్ షో చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది రోడ్ షో కాదని అల్లు అర్జున్ అన్నారు. తన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోందని అన్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. ఘటన జరిగిన తర్వాత చాలా బాధతో ఉన్నానని, ప్రతిరోజు అబ్బాయి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు.

 అన్ని ఈవెంట్స్ వదిలేసి..ఎక్కడికి వెళ్లలేక పోతున్నానని తెలిపారు. నేను ఏదో తప్పుగా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని, కాళ్లు చేతులు ఇరిగినా పర్లేదు అని నేను మాట్లాడినట్లు చెబుతున్నారని..ఆ మాటలు వింటే బాధ అవుతుందని అన్నారు.

 ఏం చేసినా ఫ్యాన్స్ కోసం, వారిని సంతోష పెట్టడం కోసమే చేస్తానని, అలాంటిది అలా ఎలా మాట్లాడతానని అన్నారు. తెలుగు వాళ్ల పరువు నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నానని, ఫ్యాన్స్ కు ఇబ్బంది కలిగే పని ఎందుకు చేస్తానని అన్నారు.

పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా తను రోడ్ షో చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది రోడ్ షో కాదని అల్లు అర్జున్ అన్నారు. సంధ్య  థియేటర్ కు దగ్గర్లో కారు ఆగిపోయిందని.. తన కోసం వచ్చిన అందరి కోసం ఒక గెస్చర్ ఇచ్చానని తెలిపారు. 

అంతమంది వచ్చినపుడు నేను లోపల దాక్కుంటే వాళ్లకు నేను ఏమిచ్చినట్లు..అందుకోసమే నేను బయటికొచ్చి చేతులు ఊపుతూ ముంందుకు వెళ్లమని చెప్పానని.. బాధ్యతగా వ్యవహరించానని తెలిపారు. 

ప్యాన్స్ కు తాను చెబితేనే వెళ్తారని  పోలీసులు కూడా చెప్పడంతో బయటకి రావడం జరిగిందని అన్నారు. బాధ్యతగా అందరినీ ముందుకు వెళ్లాలని చెప్పినట్లు తెలిపారు. 

తన వ్యక్తిత హననం జరుగుతుందని, అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు అల్లు అర్జున్ తెలిపారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగింది అనుకోని యాక్సిడెంట్ అని, అందులో ఎవరి తప్పు లేదని అన్నారు.