కౌన్సెలింగ్ : కాలేయాన్ని ప్రేమిద్దాం

కౌన్సెలింగ్ :  కాలేయాన్ని ప్రేమిద్దాం

లక్షణాలు : 

  •      కడుపులో కుడివైపు పై భాగంలో నొప్పి 
  •     కామెర్లు (జాండిస్) 
  •     హెపటైటిస్​తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్లలో కడుపులో నీరు చేరుతుంది
  •     రక్తపు వాంతులు
  •     మలం నలుపు రంగులో ఉంటుంది
  •     కాళ్ల వాపులు ఉంటాయి

శరీరంలో కీలకమైన (వైటల్) అవయవాలు ఐదు ఉంటాయి. అవి.. ఊపిరి తిత్తులు, గుండె, మెదడు, లివర్, కిడ్నీ. ఈ అవయవాలు పనిచేయకపోతే మిగిలిన అవయవాలు కూడా పనిచేయవు. వీటన్నింటిలో ముఖ్యమైనది లివర్. ఇది శరీరానికి కావాల్సిన అన్ని సరుకులను అందిస్తూ ఒక ఫ్యాక్టరీలా పనిచేస్తుంటుంది. తిన్న ఆహారంలోని ముడి పదార్థాలను ఉపయోగించుకుని శరీరానికి కావాల్సిన అన్ని రకాల ఎంజైమ్స్, ప్రొటీన్స్, హార్మోన్స్, కొలెస్ట్రాల్ వంటివి విడుదల చేస్తుంది లివర్​. అలాంటి లివర్​కి ఏదైనా ఇబ్బంది కలిగితే వాపు(ఇన్​ఫ్లమేషన్​) వస్తుంది.

ఆ ప్రభావం మిగతా అవయవాల మీద పడే అవకాశం ఉంది. అసలు లివర్​ పాడవ్వడానికి ప్రధాన కారణం హెపటైటిస్. లివర్​కి సంబంధించి చేసే స్టడీస్​ను హెపటాలజీ, హెపాటిక్ అని అంటారు. అందుకే లివర్​ వాపును హెపటైటిస్​ అంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి  మారుతూ ఉంటుంది. మనదేశంలో ఎక్కువగా వచ్చేది హెపటైటిస్ ఎ, బి వైరస్. 

ఎలా వస్తుంది?

తినేముందు చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం. మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడగకపోవడం. కలుషిత ఆహారం తినడం, నీళ్లు తాగడం వల్ల హెపటైటిస్​ ఎ, బి వ్యాధులు వస్తాయి. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమిస్తుంది. అది ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్లి... అక్కడి నుంచి లివర్​కి చేరి ఇన్​ఫ్లమేషన్​కి గురవుతుంది. దాంతో లివర్ పనితీరు డ్యామేజ్ అవుతుంది.

రకాలు

హెపటైటిస్​లో ఎ, బి, సి, డి, ఇ అనే రకాలు ఉన్నాయి. ఎ, బి రకాలు కలుషిత ఆహారం, నీటి వల్ల వస్తాయి. హెపటైటిస్​ –బిని అక్యూట్​ డిసీజ్ అంటారు. దీన్ని వెంటనే కనుక్కోవచ్చు. హెపటైటిస్– సి రకంలో ఒక వ్యక్తి నుంచి వచ్చే ద్రవ (లిక్విడ్) పదార్థాల ద్వారా వస్తుంది. అంటే.. లాలాజలం, రక్త మార్పిడి, అన్ ప్రొటెక్టెడ్ సెక్స్ వంటి వాటివల్ల హెపటైటిస్– సి వైరస్ అటాక్ అవుతుంది. హెపటైటిస్ –సి రకం క్రానిక్ డిసీజ్​కు దారితీస్తుంది. దీని బారిన పడ్డాక చాలాకాలానికి లక్షణాలు బయటపడతాయి. ఆ లక్షణాలను కనుక్కోవాలంటే ఒక్కో రకానికి ఒక్కో టైం ఉంటుంది. ఎ, బి రకాలైతే మూడు నుంచి ఐదు రోజుల్లోపు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలిక
(క్రానిక్​) రకాలకు మాత్రం కొన్ని వారాల టైం పడుతుంది. కొందరిలో అయితే కొన్నేండ్ల వరకు కనుక్కోలేం. ఎందుకంటే అవి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నెమ్మదిగా లివర్​ని డ్యామేజ్​ చేస్తుంటాయి. హెపటైటిస్​ని​ కనుక్కోవడంలో ఇలా రకరకాల కారణాల వల్ల తేడా వస్తుంది. 

ఆల్కహాలిక్ హెపటైటిస్​ 

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ రెండు రకాలుగా డ్యామేజ్ అవుతుంది. ఒకటి ఆల్కహాల్ విపరీతంగా తాగడం వల్ల అక్యూట్ హెపటైటిస్​కి దారి తీయడం. దాంతో లివర్​లో ఉన్న కణాలన్నీ డ్యామేజ్ అయ్యి​ ఫెయిల్యూర్​ అయ్యే ప్రమాదం ఉంది. రెండోది లివర్​లోని కణాలన్నీ నెమ్మదిగా కొవ్వుతో రీప్లేస్ అయ్యి, ఫ్యాటీ లివర్​  ఏర్పడుతుంది. అది కొంతకాలానికి లివర్ సిర్రోసిస్​కి దారి తీస్తుంది. అప్పుడు లివర్​ పూర్తిగా డ్యామేజ్ అయ్యి.. గట్టి పడుతుంది. అది ఇంకొన్ని అనర్థాలకు కారణమవుతుంది. అంతేకాదు లివర్​ సిర్రోసిస్ వల్ల లివర్​ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

టెస్ట్​లు సింపుల్​

హెపటైటిస్​ లక్షణాలు కనిపిస్తే లివర్​ ఫంక్షన్ టెస్ట్​ అనే బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్, బేరియోలాజికల్ టెస్ట్, ఎండో స్కోపీ వంటి సింపుల్ టెస్ట్​లు చేయించుకోవడం ద్వారా లివర్​ సమస్యలను మొదటి దశలోనే తెలుసుకోవచ్చు. వాటిని సరైన టైంలో చేస్తే ట్రీట్​మెంట్ కరెక్ట్​గా అందుతుంది. 

ట్రీట్​మెంట్స్ ఇలా..

  •     పుట్టిన పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ హెపటైటిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. 
  •     సింప్టమాటిక్ ట్రీట్​మెంట్​తో సగానికి పైగా నయం అవుతుంది. 
  •     డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. జ్వరం ఉంటే దానికి సంబంధించిన మందులు ఇస్తే సరిపోతుంది. శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి వల్ల హెపటైటిస్​              అనేది కంట్రోల్ అవుతుంది. 
  •     కామెర్లు (జాండిస్) పెరగడం, లివర్ ఫంక్షన్ బాగా దెబ్బ తిన్నప్పుడు సెలైన్​ ద్వారా యాంటీ బయాటిక్స్ లేదా లివర్​ సపోర్టివ్ మెడిసిన్స్ ఇస్తారు.
  •     నిజానికి లివర్​కి రీజెనరేట్ కెపాసిటీ ఉంటుంది. ఒక వైపు డ్యామేజ్ జరుగుతున్నా రెండో వైపు రీజెనరేట్ అవుతుంది. కానీ, లివర్ సిర్రోసిస్ అంటే.. లివర్ గట్టి        పడి, పూర్తిగా పాడవ్వడం. దీన్ని ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. ఆ స్టేజ్​లో లివర్ పనిచేయదు. మెడిసిన్స్​కి రియాక్ట్ అవ్వదు. అలాంటప్పుడు ఆరోగ్యంగా        ఉన్న కొత్త  లివర్​ని ట్రాన్స్​ప్లాంట్ చేస్తారు. 
  •     కొన్ని సందర్భాల్లో లివర్​ని 60 నుంచి 70 శాతం వరకు తీసేసినా కూడా అది మళ్లీ రీజనరేట్ అవుతుంది. మూడు నుంచి ఆరు నెలల టైంలో తిరిగి నార్మల్​         స్టేజ్​కి వస్తుంది. 
  •     లివర్​ క్యాన్సర్ వస్తే ఆపరేషన్ చేస్తారు. ఒకవేళ క్యాన్సర్ వల్ల లివర్​ పూర్తిగా డ్యామేజ్ అయితే ట్రాన్స్​ప్లాంట్ చేస్తారు. 

జాండిస్​ అనేది రోగం కాదు

టెస్ట్​లు చేయించకుండా సమస్య ఏంటో తెలియదు. కానీ, కొంతమంది టెస్ట్​లు చేయకపోయినా లక్షణాలు చూసి మందు ఇస్తుంటారు. ముఖ్యంగా కామెర్లు వచ్చినప్పుడు వెంటనే పసరు మందు తాగిస్తుంటారు. నిజానికి జాండిస్ అనేది రోగం కాదు. అది ఒక రోగ లక్షణం మాత్రమే. దానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ఒకటి హెపటైటిస్. ఇది ఉన్న వాళ్లలో జాండిస్​ కనిపిస్తుంది. కానీ, అసలు హెపటైటిస్​ రావడానికే చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి, కామెర్లు ఎందుకు వచ్చాయనేదానికి మూల కారణం తెలుసుకోకుండా నాటు వైద్యం తీసుకోవడం మంచిది కాదు. దానివల్ల లోపల ఉన్న రోగం ముదురుతుంది. ఆకు పసరుల్లో ఉండే కొన్ని రసాయనాలు లివర్​ను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. అందుకే మూల కారణం కనుక్కోకుండా నాటు వైద్యానికి వెళ్లకూడదు. 

ఒక మొక్క ఎండిపోయే స్టేజీలో ఉన్నప్పుడు నీళ్లు పోస్తే తిరిగి ప్రాణం పోసుకుంటుంది. అందుకు కారణం... దాని వేరు మట్టిలోనే ఉండడం వల్ల తిరిగి జీవం పోసుకునే శక్తి ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉన్న ఒక ప్రధాన అవయవమైన కాలేయం కూడా ఎప్పటికప్పుడు తిరిగి జీవం పోసుకుంటూ ఉంటుంది. ఇలాగెందుకంటే... కాలేయానికి రీజనరేట్ కెపాసిటీ ఉంటుంది. కానీ, ఆ కెపాసిటీకి మించి డ్యామేజ్​ అయితే మాత్రం దాన్ని పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. కాబట్టి లివర్​కు సంబంధించిన వ్యాధుల పట్ల అవగాహన చాలా అవసరం అంటోంది వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూహెచ్​ఓ). ‘వరల్డ్ హెపటైటిస్ డే’ సందర్భంగా డా. రాఘవేంద్రరావు కీలకమైన కొన్ని విషయాలు పంచుకున్నారు.

వరల్డ్ హెపటైటిస్ డే

లివర్​లో వచ్చే వాపు, దానికి మూలకారణం, వాపు వల్ల వచ్చే అనర్థాలు వంటి విషయాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్​వో అవేర్​నెస్ డే నిర్వహిస్తోంది. అందుకోసం ప్రతి ఏటా జులై 28న ‘వరల్డ్ హెపటైటిస్ డే’ పేరుతో అవేర్​నెస్ కల్పిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక థీమ్​ ఉంటుంది. ఈసారి థీమ్​... ‘వి కెనాట్ వెయిట్. వి విల్​ నాట్ వెయిట్’.

చాలా సింపుల్​ ఇవి...

  •     కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. పరిశుభ్రమైన ఆహార అలవాట్లు. వ్యక్తిగత శుభ్రత. 
  •     ప్రతి ఒక్కరూ హెపటైటిస్​ -బి వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్యూచర్​లో రాకుండా ఉంటుంది. 
  •     సేఫ్​ సెక్సువల్ ప్రాక్టీస్​ ద్వారా హెపటైటిస్​– సి రాకుండా జాగ్రత్త పడొచ్చు. 
  •     ఆల్కహాల్​కు దూరంగా ఉంటే... దాని కారణంగా వచ్చే హెపటైటిస్​ రాకుండా కాపాడుకోవచ్చు.

- డాక్టర్ ఆర్. వి. రాఘవేంద్రరావు
సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ ట్రాన్స్​ప్లాంట్ సర్జన్ & డైరెక్టర్, రెనోవా NIGL హాస్పిటల్స్, హైదరాబాద్