పందెం కోళ్లను వేలం వేసిన కోర్టు

కొల్లాపూర్, వెలుగు : నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో జడ్జి శుక్రవారం పందెం కోళ్లను వేలం  వేశారు. బుధవారం రాత్రి   కోడేరు మండలం బాడిగదిన్నెలో  కోళ్ల పందేలు ఆడుతుండగా పోలీసులు వెళ్లి దాడి చేశారు. పందెం రాయుళ్లు పారిపోగా12 కోళ్లను స్వాధీనం చేసుకుని కోర్టులో  హాజరు పరిచారు. స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టు జడ్జి జ్యోత్స్నవాటిని వేలం వేయగా.. రూ.39,650కు  కొనుగోలు చేశారు. ఆ డబ్బులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయించారు.