SA vs PAK: కెప్టెన్‌గా క్లాసన్.. పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

డిసెంబర్ 10 నుంచి పాకిస్థాన్ సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు.. మూడు వన్డేలు.. మూడు టీ20 ఆడనున్నాయి. జనవరి 7, 2024 వరకు ఈ టూర్ ఉంటుంది. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (పీసీబీ) బుధవారం (డిసెంబర్ 4) టీ20 ఫార్మాట్ కు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు స్టాన్డింగ్ కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ నాయకత్వం వహిస్తాడు. 

పాకిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టుకు హెన్రిచ్ క్లాసెన్ నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ప్రస్తుతం శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్నాడు. అతను ఈ టూర్ లో మరో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీంతో రెండో టెస్టు ముగిసేలోపు డిసెంబర్ 9 అవుతుంది. ఈ కారణంగా అతను టీ20 ఫార్మాట్ కు అందుబాటులో ఉండడు. మార్క్రామ్‌తో పాటు టెస్ట్ సిరీస్ లో ఉన్న టీ20 ఆటగాళ్లు మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, ట్రిస్టన్ స్టబ్స్ టెస్ట్ సిరీస్ కారణంగా దూరమయ్యారు. 

కీలక ఆటగాళ్ళు లేనప్పటికీ, దక్షిణాఫ్రికా టీ20 జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ టీ20  తర్వాత సఫారీల జట్టులోకి తిరిగి వచ్చారు. ఆల్-రౌండర్ జార్జ్ లిండే కూడా మూడేళ్ల విరామం తర్వాత జట్టులో ఎంపికయ్యాడు. చివరిసారిగా 2021లో సౌతాఫ్రికా టీ20 జట్టులో కనిపించాడు. సౌతాఫ్రికా టీ20 టోర్నీలో లిండే అదరగొట్టాడు. 178.12 స్ట్రైక్ రేట్‌తో 171 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.

పాకిస్థాన్ తో టీ20 సిరీస్ కు సౌతాఫ్రికా జట్టు:

హెన్రిచ్ క్లాసెన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రూగర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నార్జే, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్‌వాన్సీ, తబ్రైజ్ స్హమ్‌నెస్సీ, తబ్రైజ్ స్హమ్నెస్సీ మరియు డెర్ డస్సెన్.