ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 రూల్స్ వచ్చేశాయి. అన్ని జట్లు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఇందులో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకొనే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. అసలు విషయానికి వస్తే దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసన్ కోసం ఏకంగా రూ. 23 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈఎస్పిన్ క్రిక్ ఇన్ఫో నివేదించడంతో ఇది దాదాపుగా నిజం అనిపిస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
క్లాసన్ సన్ రైజర్స్ తరపున రెండు సీజన్ లు గా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. జట్టులో మిగిలిన ఆటగాళ్లు విఫలమైనా ఒక్కడే వారియర్ లా పోరాడిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. దీంతో ఈ సఫారీ ఆటగాడికి అన్ని కోట్లు ఇవ్వడంలో న్యాయం ఉందంటున్నారు నెటిజన్స్. క్లాసన్ తో పాటుగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్, భారత యువ సంచలనం అభిషేక్ శర్మను రిటైన్ చేసుకోనుంది. కమ్మిన్స్ కు రూ. 18 కోట్లు.. అభిషేక్ శర్మకు రూ. 14 కోట్లు ఇవ్వనున్నట్టు సమాచారం.
ఈ ముగ్గురిని సన్ రైజర్స్ రిటైన్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ముగ్గురిని కోసం హైదరాబాద్ జట్టు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందట. వీరితో పాటు ఐపీఎల్ 2024 సీజన్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ ట్రావిస్ హెడ్, భారత యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా సన్ రైజర్స్ జట్టులో చేరడం గ్యారంటీ. వీరికి ఎంత మొత్తం చెల్లిస్తారనే విషయంలో స్పష్టత లేదు. రూల్స్ ప్రకారం మొదటి 5 ప్లేయర్లకు రూ. 75 కోట్లు చెల్లించాలి.
Also Read:-నిప్పులు చెరుగుతున్న కివీస్ పేసర్లు
క్లాసన్, కమ్మిన్స్, అభిషేక్ శర్మ రూపంలో రూ. 55 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన 20 కోట్లలో హెడ్, నితీష్ కుమార్ రెడ్డికి పంచనుంది. దీని ప్రకారం హెడ్ కు రూ. 12 కోట్ల రూపాయలు.. నితీష్ కుమార్ రెడ్డికి రూ.8 కోట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ క్యాప్ఢ్ ప్లేయర్ కేటగిరిలో రూ. 4 కోట్లు పెట్టి తీసుకువచ్చు. అక్టోబర్ 31 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే చివరి తేదీ.
It's a 338% increase for Heinrich Klaasen compared to his price from the previous auction ?
— ESPNcricinfo (@ESPNcricinfo) October 16, 2024
More from SRH ? https://t.co/J0s2HCbSmS #IPL2025 pic.twitter.com/ek0oiZmLYZ