కరకట్టపై మునిగిన మంతెన ఆశ్రమం.. తాళ్ల సాయంతో బయటకొస్తున్న బాధితులు

ఏపీలో వరద బీభత్సానికి ఇదో నిదర్శనం. ప్రకృతి ఆశ్రమం పేరుతో.. కృష్ణా నది ఒడ్డున నిర్మించిన మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఇప్పుడు నీట మునిగింది. మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చాయి. దీంతో ఆశ్రమంలో చికిత్స కోసం వచ్చిన రోగులు అందరూ పైఫ్లోర్లకు వెళ్లారు. మొదటి అంతస్తులో నీళ్లు ఎక్కువగా ఉండటం.. కిందకు వచ్చే మార్గం లేకపోవటంతో.. ఆశ్రమంలోని రోగులను తాళ్ల సాయంతో బయటకు తీసుకు వస్తున్నారు రెస్క్యూ సిబ్బంది, పోలీసులు.

కృష్ణా నదికి వరద పోటెత్తింది. బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్కులపైనే నీళ్లు ప్రవహిస్తుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి మరింత వరద వస్తుండటంతో.. విజయవాడలోని కృష్ణ నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే నది ఒడ్డునే.. కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ ప్రకృతి చికిత్సాలయాన్ని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. 

Also Read:-తెలంగాణకు తప్పిన గండం

మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉన్న ప్రాంతంలోనే కరకట్టకు లీకేజీలు ఏర్పడ్డాయి. ఇసుక బస్తాలతో కాపాడే ప్రయత్నం చేస్తున్నా.. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. ఆశ్రమంలోకి నీళ్లు వచ్చాయి. దీంతో ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.