గద్వాలలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం..10 లక్షల క్యాష్ మాయం

  •     40 తులాల బంగారం, రూ.10 లక్షల క్యాష్ మాయం

గద్వాల, వెలుగు : గద్వాల టౌన్​లోని లింగం బాగ్​కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. బాధితుడు రాజేశ్​తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులో జరిగే పెండ్లికి అటెండయ్యేందుకు ఈ నెల 26న ఫ్యామిలీ మొత్తం వెళ్లారు. కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండగా రాజేశ్​మాత్రమే గురువారం తెల్లవారుజామున గద్వాలకు తిరిగొచ్చాడు.

వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంట్లో ఉన్న 40 తులాల బంగారం, రూ.10 లక్షల నగాదు దొంగతనానికి గురైనట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.