వంగూరులో జోరుగా ఇసుక తరలింపు

వంగూర్, వెలుగు: వంగూరు మండలంలోని, ఉల్పర గ్రామాల్లో ఉన్న దుందుభి వాగులో లీగల్ పేరుతో ఇల్లీగల్‌గా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అనుమతులు ఒక చోట డంపింగ్ మరో చోట చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు.  రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక  అక్రమదందా కొనసాగిస్తున్నారు. 

వాగులో నుంచి యంత్రాల ద్వారా ఇసుకను తరలించి రహస్య ప్రదేశంలో డంపింగ్ చేస్తున్నారు.  డంప్ చేసిన ఇసుకను టిప్పర్లలో తరలించి  భారీగా సొమ్ము చేసుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదు.  మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొంది పరిమితికి మించిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.  ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.