న్యూఇయర్​ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

  • అంతా మంచి జరగాలని కోరుకున్న భక్తులు
     

న్యూ ఇయర్ ​సందర్భంగా బుధవారం సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్​లోని బిర్లామందిర్, జూబ్లీహిల్స్​ టీటీడీ, పెద్దమ్మ తల్లి, బంజారాహిల్స్​లోని పూరీ జగన్నాథ, హరేకృష్ణ గోల్డెన్​ టెంపుల్స్, చిలుకూరు బాలాజీ, సూరారం కట్టమైసమ్మ ఆలయాలకు వేలాదిగా తరలివచ్చారు. స్వామివార్ల దర్శనానికి గంటలపాటు క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది.

ప్రధాన చర్చిల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వందల మంది పాల్గొన్నారు. హాలిడే కావడంతో జూపార్క్, మాదాపూర్​శిల్పారామం సందర్శకులతో కిక్కిరిసింది. కోట్​పల్లి ప్రాజెక్ట్​ వద్ద సందడి నెలకొంది.