మెదక్​లో మళ్లీ భారీ వర్షం

మెదక్, వెలుగు: మెదక్ లో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి కుండపోత వాన పడడంతో ఎంజీ రోడ్డులోని లైబ్రరీ వద్ద మెయిన్ రోడ్డు పూర్తిగా జలమయం అయ్యింది. బైక్ లు నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై నీటిని తొలగించే పనులు చేపట్టారు.