ఏపీ, తెలంగాణాలో ఫెంగల్ ఎఫెక్ట్: ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయంటే..

తమిళనాడును భారీ వర్షాలతో వణికించిన ఫెంగల్ తుఫాను.. మహాబలిపురం - కరైకల్ మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో చెన్నైతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆఫీసర్లు. భారీ వర్షాలతో చెన్నైలో రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలోని ఏడు సబ్ వేలు వరద నీటితో నిండిపోవడంతో..రాకపోకలను నిషేధించారు అధికారులు. ఇదిలా ఉండగా.. తుఫాను తీరం దాటే సమయంలో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.

Also Read :- మాలల సింహగర్జన.. తెలంగాణ వ్యాప్తంగా తరలివస్తున్న మాలలు

తుఫాను తీరం దాటినప్పటికీ మరో 24 గంటలపాటు దీని ప్రభావం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. ఆదివారం ( డిసెంబర్ 1, 2024) రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పటికే.. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..  తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదివారం ( డిసెంబర్ 1, 2024 ) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. గంటకు 40-50కి.మీతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.