తూ.గో. జిల్లాలో భారీ వర్షాలు... వరద ముంపులో లంక గ్రామాలు..

ఏపీలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు తగ్గినెట్టే తగ్గి మళ్ళీ మొదలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం ( సెప్టెంబర్ 7, 2024 ) రాత్రి భారీ వర్షాలు కురిసాయి. రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై.. ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరటంతో ధవలేశ్వరం బ్యారేజ్‌ 175 గేట్లును ఎత్తారు అధికారులు.

Also Read :- హైడ్రా కూల్చివేతలు.. తగ్గేదే లేదు

ధవళేశ్వరం నుండి 6.40 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.బ్యారేజ్‌ ప్రస్తుత నీటిమట్టం 9.30 అడుగులుగా ఉందని సమాచారం. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రానున్న 24గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ. ఇదిలా ఉండగా బుడమేరుకు మళ్ళీ పెరుగుతున్న వరద ఉధృతి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు.