ఉమ్మడి మెదక్ జిల్లాలో దంచి కొట్టింది

  • కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు 

మెదక్, రామాయంపేట, నర్సాపూర్, సిద్దిపేట, వెలుగు:  ఉమ్మడి మెదక్ జిల్లాలోని సోమవారం సాయంత్రం వాన దంచి కొట్టింది.  మెదక్,  రామాయంపేట టౌన్, నర్సాపూర్​ రెండు గంటల పాటు  భారీ వర్షం పడింది.  రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో.. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లు పూర్తిగా తడిసిపోయాయి.  మెదక్​ మండలం చిట్యాలలోని కొనుగోలు కేంద్రంలో వడ్లన్నీ తడిసి  వరదకు కొట్టుకుపోయాయి.

అదేవిధంగా సిద్దిపేట మార్కెట్ యార్డుతో పాటు దుబ్బాక, మిరుదొడ్డి, కొండపాక, నంగునూరు మండలాల్లో  ధాన్యం కేంద్రాలపై టార్ఫాలిన్ లు కప్పినా గాలికి ఎగిరిపోగా.. మరోవైపు వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి.  మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. ధాన్యాన్ని ఆపడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.