నాగర్​కర్నూల్​ జిల్లాలో భారీ వర్షం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో 33 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కల్వకుర్తిలో 71 మిల్లీ మీటర్లు, పెద్దకొత్తపల్లిలో 69, కొల్లాపూర్ లో 59.4, అమ్రాబాద్ లో58, లింగాలలో 49, నాగర్ కర్నూల్ లో 45.4, వంగూరులో 38

తాడూరులో 29, వెల్దండలో 28, ఉప్పునుంతలలో 26, అచ్చంపేటలో 52, కోడేరులో 24.6, చారగొండలో 12.6, పదరలో 10.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి నాగర్ కర్నూల్ లోని డిగ్రీ సైన్స్  కాలేజీలో 30 మీటర్ల పొడవైన కాంపౌండ్​ వాల్​ కూలిపోయింది.