ములుగు జిల్లాలో భారీ వర్షం..కల్లాల్లో తడిసిన ధాన్యం

ములుగు, వెలుగు : ములుగులో బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసుకున్న వరిధాన్యం తడిసింది. పలువురు రైతులు ధాన్యం బస్తాలపై పరదాలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. ములుగులోని తంగేడు స్టేడియంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగులు కేంద్రంలో ఆరబోసుకున్న ధాన్యం అకాల వర్షానికి తడవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

వర్షంలో సైతం ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆరబోసుకున్న రాసుల చుట్టూ నీళ్లు చేరకుండా కాలువలు తీశారు. అధికారులు రైతులకు నష్టం కలుగకుండా కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.