పుల్కల్/వెలుగు : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్‌లోకి స్వల్పంగా వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి గురువారం1942 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టులో తగినంత నీరు లేకపోవడంతో కెనాల్ ద్వారా ఇప్పటివరకు పంటలకు నీరు వదల్లేదు.
ప్రస్తుతం స్వల్పంగా వరద వస్తుండడంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.222 టీఎంసీలు నిల్వ ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.