శ్రీశైలంలోకి భారీ వరద

  •     జూరాల దగ్గర 37 గేట్లెత్తిన అధికారులు  
  •     1,77,361 క్యూసెక్కులు విడుదల  

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. కర్నాటకలోని ప్రాజెక్టుల నుంచి వరద పెరగడంతో సోమ వారం జూరాల ప్రాజెక్టు 37 గేట్లను ఎత్తి శ్రీశైలం జలాశయానికి 1,77,361 క్యూసెక్కును విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాంలో పూర్తి స్థాయి నీటిమట్టం 123.081 టీఎంసీలు కాగా, 98.810 టీఎంసీలను నిల్వ ఉంచుకొని 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 1,15,405 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. నారాయణపూర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 33.373 టీఎంసీలు కాగా, 27.767 టీఎంసీలను నిల్వ ఉంచుకొని 25 గేట్లను ఓపెన్  చేసి 1,44,250 క్యూసెక్కులు వదులుతున్నారు.

ఈ ప్రాజెక్టుకు 1.59 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. జూరాల ప్రాజెక్టు ఫుల్  కెపాసిటీ 9.657 టీఎంసీలు కాగా, 7.627 టీఎంసీలు  నిల్వ ఉంచుకొని 37 గేట్లను ఓపెన్  చేసి నీటిని విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా 1.45 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,292 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్​కు 1,500 క్యూసెక్కులు, భీమా-కు 1,300, భీమా–-2కు750, సమాంతర కాలువకు 300, లెఫ్ట్​ కెనాల్ కు 870, రైట్ కెనాల్​కు 596 క్యూసెక్కులతో పాటు మొత్తంగా జూరాల నుంచి  1,77,361 క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.70 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.