శబరిమలకు పోటెత్తిన భక్తులు .. పంబ నుంచి క్యూ..

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 20 ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. రాబోయే రోజుల్లో రోజుకు లక్షకు పైగా భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

కేరళలోని శబరి కొండ స్వామియేశరణం అయ్యప్ప నామంతో మారుమ్రోగుతుంది. పంబ నుంచి సన్నిధానం భక్తులు బారులు తీరారు.  ప్రస్తుతం ( డిసెంబర్ 21)న స్వామి దర్శనానికి ఆరుగంటల సమయం పడుతుంది. భక్తులు ఇబ్బంది పడకుండా  ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అన్ని చర్యలు తీసుకుంది.  నిన్న ఒక్క రోజే ( డిసెంబర్ 20) 80 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు.  మకర విళక్కు సీజన్ లో మండల పూజ కోసం నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా... లక్షలాది భక్తులు స్వామిని దర్శనం కోసం తరలి వస్తున్నారు.

  డిసెంబర్ 26వ తేదీన సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో తొలుత అయ్యప్ప స్వామిని ‘తంకా అంకి’తో అలంకరించిన తర్వాత, పవిత్రమైన బంగారు వస్త్రాన్ని ఉత్సవ ఊరేగింపుతో ఆలయానికి తీసుకొస్తారు. తర్వాత మండల పూజ నిర్వహిస్తారు. ఈ మండల పూజ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీ నుంచి అయ్యప్ప దర్శనానికి దాదాపు లక్ష మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.