శబరి కొండ కిట కిట.. అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటలు

శబరిమల కొండకు భక్తులు పోటెత్తారు.  జనవరి 4 వ తేది అయ్యప్పస్వామిని  దాదాపు లక్షమందిని దర్శనం చేసుకున్నారని  ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.  స్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.  80 వేల మందికి వర్చువల్ క్యూ ద్వారా దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి దర్శనం కల్పించగా మరో 20 వేల టికెట్లను స్పాట్ దర్శనానికి అనుమతించారు.

పంచ గణపతి ఆలయం నుంచి సన్నిధానం వరకు భారీగా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు.  క్యూలైన్లలో ఉన్న భక్తులకు  ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కనీస సౌకర్యాలు కల్పించింది.  మకర విళక్కు రోజున... మకరజ్యోతి దర్శనానికి దేవస్థానం బోర్డు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 

శబరిమలలో అయ్యప్ప భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. అయ్యప్ప స్వామి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక, స్పాట్‌ దర్శనానికి 20 వేల టికెట్లను ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఇచ్చింది. పంబ నుంచి సన్నిదానం వరకు భారీగా క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు కనీస వసతులు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న మకరజ్యోతి దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సీజన్ లో స్వామిని రోజుకు 90 వేల మంది కంటే ఎక్కువ మంది దర్శించుకుంటున్నారు, మకర విళక్కు ఉత్సవాల్లో  భాగంగా ఈ నెల 12 వ తేదీన పందళం నుంచి తిరువాభరణం ఊరేగింపు ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు.