మేడ్చల్ మల్కాజిగిరిలో రూ.15లక్షల విలువైన అల్ఫాజోలం పట్టివేత

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో భారీగా ఆల్ఫాజోలం పట్టుబడింది. అచైపల్లీ ఎక్స్ రోడ్డు దగ్గర కారులో తరలిస్తున్న 15లక్షల విలువైన ఒక కేజీ అల్ఫా జోలంతో పాటు 7లక్షల89వేల5వందల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు ఎల్లంకి సాయి కుమార్ గౌడ్ గుమ్మడి దల, శివ్వంపేట, మేడ్చల్ ప్రాంతాల్లోలోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు పోలీసులు.