హైదరాబాద్: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్‌ను సవాల్ చేస్తూ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. 2024, డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు విచారణను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. కాగా, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో భాగంగా 2024, డిసెంబర్ 13వ తేదీ ఉదయం అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో అరెస్ట్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించాడు బన్నీ. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు బన్నీ లాయర్లు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు తరుపున పీపీ వాదనలు వినిపించారు.
ALSO READ : చిరంజీవి వెళ్లేది పోలీస్ స్టేషన్‌కు కాదు.. అల్లు అర్జున్ ఇంటికి
కేసుకు సంబంధించిన పూర్తి వివారలు ఇవ్వాలని పీపీని న్యాయస్థానం ఆదేశించింది. పోలీసుల వద్ద నుండి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి సాయంత్రం 4 గంటలకు కోర్టుకు అందజేస్తానని తెలిపారు. దీంతో న్యాయస్థానం కేసు విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. హై కోర్టు నిర్ణయంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. బన్నీకి బెయిల్ లభిస్తుందా..? లేక జైలుకు వెళ్లక తప్పదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.