ఆస్పత్రుల్లో నియామకాలపై నివేదిక ఇవ్వండి : దామోదర రాజనర్సింహ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రిల్లో భర్తీ చేయాల్సిన పోస్టులపై నివేదిక సమర్పించాలని అధికారులను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్​లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యశాఖ హెచ్​ఓడీలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్ ఫ్రాస్టక్చర్​పై చర్చించారు. 

ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ.. ఎక్విప్మెంట్ రిపేర్లతోపాటు ఆస్పత్రుల నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్  ప్రకారం సౌలతులు కల్పించాలన్నారు. సమావేశంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.వాణి, వైద్యారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ కుమార్, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.