ఛత్తీస్‌గఢ్‌లో అంగన్ వాడీ వర్కర్ల కష్టాలు

ఛత్తీస్‌గఢ్‌లో అంగన్ వాడీ వర్కర్ల కష్టాలు

కొన్ని గ్రామాల్లో ప్రజలకు నేటికి మెరుగైన వైద్యం అందడం లేదు.  ముఖ్యంగా అడవి చుట్టుపక్కల గ్రామాలకు వైద్యులు, అంగన్ వాడీ వర్కర్లు చేరుకోలేకపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలే ఇందుకు ఎగ్జాంపుల్. బల్‌రాంపూర్ జిల్లా యంత్రాంగం పలు గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల అంగన్ వాడీ వర్కర్లు  గంటల తరబడి నడిచి దట్టమైన అడవులు, పర్వతాలను దాటుకుని  ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలో.. రాళ్లు రప్పలు,  దట్టమైన అడవులను దాటి ప్రజలకు వైద్యం చేశారు.

 

బల్‌రామ్‌పూర్‌ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.  అంగన్ వాడీ వర్కర్లు కొండ ప్రాంతాలను దాటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  నడవడానికి ఇబ్బందిగా ఉన్న రోడ్లను దాటుకుని హెల్త్ వర్కర్లు గ్రామానికి ఎలా చేరుకున్నారనేది వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అడవులతో పాటు ఎత్తైన ప్రాంతాలను ఎక్కుతున్నప్పుడు అంగన్ వాడీ వర్కర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎంతో ఇబ్బంది పడి అంగన్ వాడీ వర్కర్లు బీపీ, షుగర్, ఓవరాల్ హెల్త్‌ని చెక్ చేశారని.. చాలా వరకు బాగానే ఉందని బల్‌రాంపూర్ డీసీ కుందన్ కుమార్ తెలిపారు. ఇద్దరు అంగన్ వాడీ వర్కర్లు హల్మీ, సుచిత 10 కి.మీ నడిచి ఝల్వాసా అనే గ్రామాంలో   ప్రజలకు హెల్త్ చెకప్ చేశారన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలు జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయన్నారు.