Good Health : ఒక్క జామ పండు తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. డోంట్ మిస్..!

ఆరోగ్య జామ జామలో రుచికి రుచి దాంతో పాటు ఎన్నో వ్యాధులను ఎదుర్కొనే వ్యాధి నిరోధకశక్తి పుష్కలంగా ఉంది. జామ పండుతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని ఇవి:

Also Read :- ప్యాకెట్ ఫుడ్ వల్ల పేగు సంబంధ వ్యాధులు వస్తాయి

  • జామపండులో విటమిన్-ఏ చాలా ఎక్కువ. ఇది కంటిచూపును చాలాకాలం పాటు పదిలంగా కాపాడుతుంది. క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ వంటి అనేక కంటి వ్యాధులను జామ నివారిస్తుంది. 
  • జామలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి.. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. 
  • జామలో పీచు పదార్ధాలు ఎక్కువ, చక్కెర శాతం తక్కువ. అందుకే బరువు నియంత్రించడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. అందుకే క్రమం తప్పకుండా జామ పండు తినేవారి బరువు నియంత్రణలో ఉంటుంది. 
  • జామలో విటమిన్-సి పుష్కలం. అందుకే ఇది విటమిన్-సి లోపం వల్ల వచ్చే స్కర్వీతో పాటు అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
  • జామ చాలా థైరాయిడ్ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి జామ ఉపయోగపడుతుంది. అంతేకాదు.. ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. 
  • జామపండు తినేవారి మెదడు చురుగ్గా ఉంటుంది. ఇందులోని విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాలే దీనికి కారణం.