రాత్రి పూట భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తింటే జరిగేది ఇది..!

చాలా మంది తీపి కోసం పంచదార వాడుతుంటారు. కానీ, చక్కెర కన్నా బెల్లం మంచిదని వైద్యులు చెబుతున్నారు. బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉండదు. అలాగే కొన్ని అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ బెల్లం పనిచేస్తుంది. రాత్రి పూట భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్స్ను యాక్టివేట్ చేస్తాయి.

ALSO READ | Good Health : వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె ఎంత మోతాదులో ఉండాలో ఎవరికైనా తెలుసా..! ఎక్కువ తాగితే ఆరోగ్యానికి చేటు

దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా రావు. లివర్ను శుభ్రపరిచేందుకు బెల్లం పనికొస్తుంది. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి. దీంతో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. శరీర మెటబాలిజం బాగుంటుంది.ఒంట్లో అధికంగా ఉండే నీరు కూడా బయటకు వెళ్లిపోతుంది.

V6 వెలుగు, లైఫ్