బీర్తో బెనిఫిట్స్.. హెల్త్కు మంచిదట

బీర్తో బెనిఫిట్స్.. హెల్త్కు మంచిదట

ప్రపంచంలో ఎక్కువగా తాగుతున్న ఆల్కాహాల్ ఎదైనా ఉందంటే అది బీర్ మాత్రమే.. పార్టీలు, ఫంక్షన్లు, పెళ్లి్ల్లు ఇలా అకేషన్ ఏదైనా మందు బాబులు బాటిల్ లేపాల్సిందే. అసలే ఇప్పుడు ఎండాకాలం. ఎండనుంచి కాస్త ఉపశమనం పొందడం కోసం టైం దొరికినప్పుడల్లా ఒక బాటిల్ ఎత్తుతుంటారు. కొందరు బీర్ అతిగా తాగితే ప్రాణాంతకం అని సూచిస్తుంటే.. ఇంకొందరు బీర్ తాగితే హెల్త్ కు మంచిదని చెప్తున్నారు. 

బీర్ పూర్తిగా సహజమైంది: 

చాలామంది.. బీర్ లో కెమికల్స్ కలుపుతారు, ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేసి స్టోర్ చేస్తారని అనుకుంటారు. కానీ, వాస్తవానికి బీర్ పూర్తిగా సహజమైంది. ఆరెంజ్ జూస్, పాల ఇచ్చే బెనిఫిట్స్ ఇస్తుంది.

తక్కువ క్యాలరీలు... ఎక్కువ కార్బ్ కంటెంట్: 

ఇతర డ్రింక్స్ తో పోల్చితే బీర్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 3 లీటర్ల బీర్ లో 125 కేలరీలు ఉంటాయి. 300 గ్రాముల కార్డ్ ఉంటాయి. ఇది రోజు తీసుకునే అర లీటర్ పాలతో సమానమైనది.

బీర్ కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తుంది:

బీర్.. శరీరంలో హెచ్ డీఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. బీర్ శరీరానికి పవర్-ఫ్లష్ లాగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఎల్ డీఎల్ ను తగ్గించడానికి బీర్ సాయ పడుతుంది.

హార్ట్ ప్రాబ్లమ్స్ ను దూరం చేస్తుంది:

బీర్ లో పోషకాలు ఎక్కువ. విటమిన్ బీ, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండెపోటును నివారించడానికి సాయ పడుతుంది. బీర్ లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్తను మెరుగుపరుస్తుంది. 

నోట్: ఎవరేది చెప్పినా సరే.. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే హెల్త్ కు ప్రమాదమే. ఎవరో చెప్పారు కదా అని ఓవర్ గా తాగేస్తుంటే.. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. ఏదైనా మితంగా తీసుకుంటేనే హెల్త్ కు మంచింది.