టెస్ట్ మ్యాచ్ చరిత్రలోనే గొప్ప విజయం

టెస్ట్ మ్యాచ్ చరిత్రలోనే గొప్ప విజయం
మెల్‌‌బోర్న్‌‌: బాక్సింగ్‌‌ డే టెస్ట్‌‌లో టీమిండియా సాధించిన విజయం టెస్ట్‌‌ చరిత్రలోనే  గొప్ప కమ్‌‌బ్యాక్‌‌ అని జట్టు హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్ట్రి పేర్కొన్నాడు. ‘ఈ రోజు దక్కిన విజయం.. ఇండియన్‌‌ క్రికెట్‌‌తోపాటు టెస్ట్‌‌ చరిత్రలోనే ఓ గొప్ప కమ్‌‌బ్యాక్‌‌గా ఎప్పటికీ నిలిచిపోతుంది.  మా జట్టు36 రన్స్‌‌కే ఆలౌటైన తర్వాత .. పుంజుకుని బదులు తీర్చుకోవడం అనేది ఓ అద్భుతం. ఈ క్రెడిట్‌‌ ప్లేయర్లకే దక్కుతుంది. కోట్లాది మంది ఫ్యాన్స్‌‌కు ఇంత కంటే గొప్ప న్యూ ఇయర్‌‌ గిఫ్ట్‌‌ మరొకటి ఉండదు. కెరీర్‌‌లో తొలి మ్యాచ్‌‌ ఆడిన గిల్‌‌, సిరాజ్‌‌ సూపర్‌‌గా పెర్ఫామ్‌‌ చేశారు. ఫీల్డ్‌‌లో వారు చూపించిన మెచ్యురిటీ చాలా గ్రేట్‌‌. ఉమేశ్‌‌ లేని టైమ్‌‌లో లాంగ్‌‌ స్పెల్స్‌‌ వేయాల్సి వచ్చినప్పుడు తన బౌలింగ్‌‌లో సిరాజ్‌‌ చూపించిన క్రమశిక్షణ, నిలకడను ఎంత పొగిడినా తక్కువే.  గిల్‌‌ కెరీర్‌‌లో ఫస్ట్‌‌ టెస్ట్‌‌ ఆడుతున్నట్లు ఎక్కడా కనిపించలేదు. చాలా మెచ్యుర్డ్‌‌గా ఆడటమే కాకుండా ఈజీగా షాట్స్‌‌ కొట్టాడు. ఐపీఎల్ వల్లే ఇది సాధ్యమైందని అనుకుంటున్నా. ఇంటర్నేషనల్‌‌ లెవెల్‌‌ ప్లేయర్లతో డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ షేర్‌‌ చేసుకోవడం వల్ల… తొలి మ్యాచ్‌‌ ఆడుతున్నాననే భయం చాలా త్వరగా పోతుంది. బ్యాటింగ్‌‌ చేస్తున్నప్పుడు పంత్‌‌ చూపిన పట్టుదల, కౌంటర్‌‌ అటాకింగ్‌‌.. మ్యాచ్‌‌ను చాలా ప్రభావితం చేసింది. బౌలర్లు అందరూ తిరుగులేని పెర్ఫామెన్స్‌‌ చేశారు. జడేజా రాకతో టీమ్‌‌లో చాలా బ్యాలెన్స్‌‌ వచ్చింది. నిఖార్సైన ఆల్‌‌రౌండర్‌‌. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌‌ చేసే సత్తా ఉంది. ఉమేశ్‌‌ లేకపోయినా జడ్డూ ఉండటం వల్లే బ్యాలెన్స్‌‌ దెబ్బతినలేదు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. For More News.. న్యూఇయర్ ఆఫర్: అమెజాన్‌‌‌‌‌‌‌‌లో ‘మెగా శాలరీ డేస్‌‌‌‌‌‌‌‌’ ఇంకా అందని వరదసాయం.. రోడ్డు మీదే వంట చేసుకుంటున్న బాధితులు ఇయర్ ఎండ్ సేల్స్‌తో జోరందుకున్న ఆన్‌లైన్ షాపింగ్