సోషల్ మీడియాలో రీల్స్ కోసం.. బైక్ స్టంట్స్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు

సోషల్ మీడియా రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తూ..ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పెద్ద అంబర్ పేట్ సమీపంలోని ఓ జాతీయ రహదారిపై వర్షంలో  KTM బైక్ పై ఇద్దరు యువకులు స్టంట్స్  చేస్తూ రీల్స్ చేశారు. అలా చేస్తుండగా...బైక్ అదుపు తప్పి ఒక్కసారిగా కింద పడ్డారు. ఈ ప్రమాదంలో శివ అనే యువకుడికి...తీవ్ర గాయాలై, మృతి చెందాడు. 

Also Read:-ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు.. సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి


బైక్ నడిపిన యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితున్ని వెంటనే...లోకల్ హాస్పిటల్ కు తరలించారు. విజయవాడ జాతీయ రహదారిపై అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆ రహదారిపై ఒక లైన్ మరమ్మతుల కోసం వదిలేశారు. దీంతో ఆ రోడ్లపై యువకులు బైక్ లతో రీల్స్ కోసం స్టంట్ లు చేస్తున్నారు.