Abu Dhabi T10 League: క్రికెట్ చరిత్రలో అతి పెద్ద నో బాల్.. ప్రమాదంలో యూఏఈ బౌలర్

ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (U A E)లో అబుదాబి టీ10 లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌కి క్రికెట్ అభిమానుల్లో మంచి ఆదరణ ఉంది. 10 ఓవర్ల పాటు జరిగే ఈ మ్యాచ్ లో అభిమానులని బాగా అలరిస్తాయి. ఈ లీగ్ లో ప్రపంచం విస్తు పోయే సంఘటన ఒకటి జరిగింది. న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో సాంప్ ఆర్మీకి చెందిన యూఏఈ బౌలర్ హజ్రత్ బిలాల్ భారీ నో బాల్ వేశాడు. అతని పాదం క్రీజ్ లైన్ కు చాలా దూరంలో ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ నో బాల్ అనేక అనుమానాలకు తావునిస్తుంది. 

ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో  ఈ సంఘటన జరిగింది. ఈ ఓవర్ లో అతను 9 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే నాలుగో బంతిని మాత్రం ఊహించని రీతిలో నో బాల్ బాల్ వేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. చూస్తుంటే హజ్రత్ బిలాల్ స్పాట్ ఫిక్సింగ్ చేసాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్స్ సైతం అతను ఖచ్చితంగా స్పాట్ ఫిక్సింగ్ చేసాడని ఆరోపిస్తున్నారు. ఒకవేళ బిలాల్ పై  విచారణ చేపట్టి అతను స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డని తెలిస్తే అతని క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంది. 

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సంప్ ఆర్మీ జట్టు 10 ఓవర్లలో 135 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూయార్క్ స్ట్రైకర్స్ 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సంప్ ఆర్మీ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.