మేం హిందూత్వను ఇంకా వదులుకోలేదు

మేం హిందూత్వను ఇంకా వదులుకోలేదు

ముంబై: శివ సేన ఇప్పటికీ హిందూత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉందని ఆ పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివ సేనల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో రైట్ వింగ్ లీడర్ అయిన ఉద్ధవ్.. ఇప్పుడు సెక్యులర్‌‌వాదిగా మారిపోయారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. ఎవరి నుంచి హిందూత్వ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను హిందూత్వను ఇంకా వదులుకోలేదని స్పష్టం చేశారు.

‘పురాతన ఆలయాలను పునరుద్ధరించడానికి టెంపుల్ ఫండ్‌‌ను కేటాయిస్తున్నాం. మేం హిందూత్వను వదులుకోలేదని ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ అర్థం చేసుకోవాలి. ప్రాచీన భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పాత ఆలయాలను గుర్తించడంలో ప్రతిపక్ష బీజేపీ మాకు సహకరించాలి’ అని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.