ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన జరుగుతోంది. ఈ నిరసనలో పాల్గొనేందుకు భారీ ఎత్తున ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హత్రాస్ ఘటనపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సంఘటనను ఖండిస్తూ, కార్యకర్త మరియు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ కుటుంబాన్ని బంధించి బాధితురాలికి అంత్యక్రియలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.
ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్నది గూండరాజ్. పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు, ప్రతిపక్ష నాయకులను, మీడియా వ్యక్తులను ప్రవేశించడానికి అనుమతించడం లేదు. బాధితురాలి కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్‌లను వారు తీసుకెళ్లారు” అని కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.
