అత్యాచారం, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని నిర్భందించి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడంపై హత్రాస్ దారుణంపై అలహాబాద్ హైకోర్ట్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిథల్ మరియు జస్టిస్ రాజన్ రాయ్ డివిజన్ బెంచ్ రెండు గంటల విచారణలో బాధితుడి కుటుంబం మరియు వివిధ ప్రభుత్వ అధికారులను వాదనల్ని విన్న కోర్ట్ ..తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా బాధితురాలి కుటుంబసభ్యులు మాట్లాడుతూ..ఈ కేసు విచారణను ఢిల్లీకి లేదా ముంబైకి మార్చాలని కోర్ట్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును ఉత్తర ప్రదేశ్ నుంచి బదిలీ చేయాలని కుటుంబం కోరుకుంటుందని బాధితురాలి కుటుంబ తరఫు న్యాయవాది సీమా కుష్వాహా తెలిపారు.
ఇప్పటికే నిందితులకు మద్దతు ఇస్తున్న వివిధ గ్రూపుల నుంచి కుటుంబానికి బెదిరింపులు వస్తున్నందున కుటుంబ భద్రత పెద్ద ఆందోళన కలిగిస్తోందని అన్నారు. భద్రతపై నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. కుటుంబ గోప్యతకు రాజీ పడకుండా దర్యాప్తు సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచాలని సీమా కుష్వాహా కోర్టును కోరారు.
కాల్ వివరాల రికార్డులు మరియు ఇతర సమాచారానికి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం ద్వారా, ఈ కేసులోని నిజాల్ని మార్చడానికి ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. తన కుమార్తె దహన కార్యక్రమాలు తమకు తెలియకుండా, విరుద్దంగా జరిగాయని,తమని అనుమతించలేదని పేర్కొన్నారు.
తమ కుమార్తె దహన కార్యక్రమాల్ని బలవంతం చేశారని అయినా హత్రాస్ పోలీసులు తమ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. స్థానిక పోలీసులు తమను వేధిస్తున్నారని, వారిపై జిల్లా మేజిస్ట్రేట్ ఒత్తిడి తెస్తున్నారని వారు తెలిపారు.
ఈ సందర్భంగా హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ తన వెర్షన్ ఇచ్చారు. 19 ఏళ్ల బాధితురాలి దహన సంస్కారాలను రాత్రి వేళల్లో నిర్వహించడం సంబంధిత నిర్ణయానికి పూర్తి బాధ్యత తమకుందని హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్సర్ వెల్లడించారు.
కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం కుల హింసను రేకెత్తించడానికి ప్రయత్నించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా రాత్రి పూట దహన సంస్కారాలు నిర్వహించినట్లు లక్సార్ విజ్ఞప్తి చేశారు. దహన సంస్కారాలు మరింత ఆలస్యం చేస్తే శరీరం కుళ్ళిపోయే అవకాశం ఉందని, ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల నుండి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ కోర్ట్ కు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్ట్ విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.
