ఉత్తర్ ప్రదేశ్ దారుణంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ బాధితురాలికి న్యాయం జరుగాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్, భీమ్ ఆర్మీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై లేదా ఢిల్లీలో మహిళలపై లైంగిక దాడి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎలాంటి రాజకీయం తగదన్న ఆయన.. నిందితులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు అనుమానిస్తున్నారని చెప్పారు. ఈ సమయంలో బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందాలన్నారు.
