Mohammed Shami: నా కూతురిపై షమీ ప్రేమ అబద్ధం.. మాజీ భార్య హసిన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా సీనియర్‌ ఫాస్ట్ బౌలర్ మహ్మద్‌ షమీపై చాలా కాలం తర్వాత తన కుమార్తె ఐరాను కలుసుకున్నాడు. తన కూతురితో షాపింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో మహ్మద్ షమీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ అయ్యాడు. “చాలా కాలం తర్వాత నేను నా కూతురుని చూశాను. ఆమెను మళ్లీ చూసినప్పుడు నా కాలం ఆగిపోయినట్టుగా అనిపించింది. నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో పదాలు సరిపోవు". అని కూతురిపై తన ప్రేమను చెప్పుకున్నాడు. దీనికి బదులుగా అతని మాజీ భార్య హసీన్‌ జహాన్‌ షమీపై మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది.

హసీన్‌ జహాన్‌ మాట్లాడుతూ ఇలా అంది.. "నా కుమార్తె పాస్‌పోర్ట్ గడువు ముగిసింది. కొత్త పాస్‌పోర్ట్ కోసం షమీ సంతకం తప్పనిసరి. అందుకే తండ్రిని కలిసేందుకు వెళ్లినా షమీ సంతకం చేయలేదు. తన కూతురితో కలిసి ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. షమీ ప్రకటనలు చేసే కంపెనీకి ఆమెను తీసుకెళ్లాడు. ఆ షాపులో నా కూతురు బూట్లు, బట్టలు కొన్నది. అక్కడ ఏదైనా కొంటే షమీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. నా కుమార్తెకు గిటార్, కెమెరా కావాలి అని అడిగినా ఆమెకు ఆ వస్తువులు కొనలేదు.

Also Read : ధోనీ ఆటగాళ్లను లెక్కచేయడు.

అతడు నా కూతురు గురించి ఎప్పుడూ ఆలోచించడు. ఎప్పుడు తన గురించి తానే ఆలోచించుకుంటాడు. గత నెలలోనూ ఐరాను కలిశాడు. కానీ అప్పుడు ఇలాంటి వీడియోలేవీ షేర్‌ చేయలేదు. అతను ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు". అని హసీన్ జహాన్ చెప్పుకొచ్చింది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ గాయం కారణంగా క్రికెట్ ఆడలేదు. గాయంతో 10 నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న ఈ ఫాస్ట్ బౌలర్ వేగంగా కోలుకుంటున్నాడు. ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.