Sania Mirza: నిజమేంటి..?: సోషల్ మీడియాలో సానియా మీర్జా రెండో పెళ్లి గోల

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లిపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఆరు నెలల క్రితం పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌తో తన బంధాన్ని తెంచుకున్న సానియా.. ఈమధ్య మరో వ్యక్తిని రహస్యంగా పెళ్లాడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అందునా, ఆమె రెండో పెళ్లి మరోసారి పాకిస్థానీ వ్యక్తితోనే జరిగిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో, సానియా పెళ్లి గోల మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సానియా మీర్జాను మనువాడినట్లు పుకార్లు వస్తున్న వరుడి పేరు.. ఉమైర్ జస్వాల్. వారం రోజుల క్రితం ఈ నటుడు పెళ్లి జరగ్గా.. అతను తన పెళ్లి ఘట్టాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు. తెలియజేశాడు బాగానే ఉంది.. కానీ, అతనిక్కడ ఓ తిరకాసు పెట్టాడు. తాను మనువాడిన వధువు ఎవరనేది గోప్యంగా ఉంచాడు. పేరు వెల్లడించలేదు.. ఫోటోలు బహిర్గత పరచలేదు. అదే సానియా మీర్జా మెడకు చుట్టుకుంది. అతని పక్కనున్న పెళ్లికూతురు సానియా మీర్జా అని అందరూ భావిస్తున్నారు. కాదని, మనమూ చెప్పలేం. ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరు నోరు విప్పితే కానీ, ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పడదు.

ఎవరీ ఉమైర్ జస్వాల్..?

సానియాతో విడాకుల అనంతరం షోయాబ్ మాలిక్ పెళ్లాడిన నటి సనా జావేద్ మాజీ భర్తే.. ఈ ఉమైర్ జస్వాల్. ఇతను సింగర్, నటుడు. సనా జావేద్ తో విడాకుల అనంతరం ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న ఉమైర్.. వారం రోజుల క్రితం మరోసారి పెళ్లి పీటలెక్కాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల నడుమ అతని వివాహం అంగరంగ వైభవంగా జరిగిందని పాక్ మీడియా కథనాలు ప్రసారం చేసింది.

దుబాయ్‌లో సానియా..

షోయాబ్ తో విడాకుల అనంతరం సానియా, తన కుమారుడు ఇజాన్ మాలిక్‌తో కలిసి దుబాయ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఈమధ్యనే సోషరి అనమ్ మీర్జా, వారి పిల్లలతో కలిసి దుబాయ్‌లోని ఓ మాల్‌కు వెళ్లిన సానియా.. అక్కడ గడిపిన క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anam Mirza (@anammirzaaa)