హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు ఇవాళ(మంగళవారం) రైతుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆయన అంబాలాకు వెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు… సీఎం కాన్వాయ్ ని అడ్డుకుని నల్ల జెండాలు చూపించారు. విధుల్లో ఉన్న పోలీసులు సీఎం కాన్వాయ్ కి దారి ఇవ్వాలంటూ రైతులను కోరినా పలితం లేక పోయింది. రైతులు సీఎం కు నల్ల జెండాలతో పాటు కర్రలు కూడా చూపించారు.
అంతేకాదు పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డును బ్లాక్ చేసి ఉండటంతో… సీఎం కాన్వాయ్ వెనుదిరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల క్రమంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు అంబాలాకు ఖట్టర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
