హర్వంశ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ

చెన్నై : వికెట్ కీపర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్వంశ్‌‌‌‌‌‌‌‌ పంగాలియా (117) సెంచరీతో సత్తా చాటడంతో ఆస్ట్రేలియా అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19తో రెండో యూత్‌‌‌‌‌‌‌‌ టెస్టులో ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19 టీమ్  భారీ స్కోరు చేసింది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 316/5తో రెండో రోజు, మంగళవారం ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 492 రన్స్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆలౌటైంది. ఓ దశలో ఇండియా 402/9తో నిలవగా.. 

చివరి బ్యాటర్ అన్మోల్‌‌‌‌‌‌‌‌జీత్‌‌‌‌‌‌‌‌ (11 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో కలిసి పదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 90 రన్స్ జోడించిన హర్వంశ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు మంచి స్కోరు అందించాడు. అనంతరం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ రెండో రోజు చివరకు 142/3 స్కోరు చేసింది. ఓపెనర్లు కింగ్‌‌‌‌‌‌‌‌సెల్ (4), బడ్జ్‌‌‌‌‌‌‌‌ (5) ఫెయిలవగా.. ఒలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీక్ (62 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), అలెక్స్‌‌‌‌‌‌‌‌ లీ యంగ్ (45 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో నిలిచారు.